News October 31, 2024
పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజించాలి?
మనం నిత్యం భగవంతుడికి పువ్వులతోనే పూజ చేస్తుంటాం. ఏ పూజ అయినా పుష్పాలదే ప్రాధాన్యత. పుష్పాల్లో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి. పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట. దేవుడికి పువ్వుల సువాసన అంటే మహా ఇష్టమని అంటారు. పుష్పం త్రివర్గ సాధనం కాబట్టి సంపద, స్వర్గం, మోక్షాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
Similar News
News November 11, 2024
బీఏసీ సమావేశానికి YCP గైర్హాజరు
AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రూ.2.94లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు.
News November 11, 2024
KCRకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
TG: 10 నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న KCR వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు’ అని తెలిపారు.
News November 11, 2024
GET READY: 4.05కు ‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. రిలీజ్ లోపు రెండు ట్రైలర్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.