News May 19, 2024
భార్య, కుమారుడు నాకు తిండి పెట్టట్లేదు: మాజీ మంత్రి
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ రాజకుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. భార్య దివ్యాసింగ్, కుమారుడు అనిరుధ్ తనపై దాడి చేశారని, తిండి కూడా పెట్టడం లేదంటూ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఇంటి నుంచి తరిమేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు నెలకు రూ.5 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. అయితే నిజమైన బాధితులం తామేనని కుమారుడు తెలిపారు. ఆధారాలను కోర్టుకు అందజేస్తామన్నారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!
జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.
News December 14, 2024
హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.
News December 14, 2024
గురుకులాల ఇమేజ్ పెంచుతాం: సీఎం రేవంత్
TG: గురుకులాల్లో చదివిన వారు ప్రతిష్ఠాత్మక పదవులు చేపట్టారని CM రేవంత్ అన్నారు. గురుకుల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. చిలుకూరులో జరిగిన ‘గురుకులాల బాట’లో CM మాట్లాడారు. ‘ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువనే అపోహ ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లకు కామన్ డైట్ రూపొందించాం. గురుకులాలను ప్రక్షాళన చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.