News March 18, 2024

భర్తపై భార్య గొడ్డలితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

image

భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఉరవకొండ మండలంలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మండలంలోని పెద్దముష్టూరుకు చెందిన ఓబులేసు మద్యానికి బానిసవ్వడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గొడవపడ్డారు. భర్త తాగి ఇబ్బందులు పెడుతుండటంతో తట్టుకోలేక గొడ్డలితో దాడిచేసింది. అతడిని ఉరవకొండకు అక్కడ నుంచి అనంతపురం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Similar News

News January 23, 2026

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

image

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 23, 2026

ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

image

అనంతపురంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.

News January 23, 2026

అనంత: భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.