News March 18, 2024
భర్తపై భార్య గొడ్డలితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఉరవకొండ మండలంలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మండలంలోని పెద్దముష్టూరుకు చెందిన ఓబులేసు మద్యానికి బానిసవ్వడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గొడవపడ్డారు. భర్త తాగి ఇబ్బందులు పెడుతుండటంతో తట్టుకోలేక గొడ్డలితో దాడిచేసింది. అతడిని ఉరవకొండకు అక్కడ నుంచి అనంతపురం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News October 14, 2024
అనంత, సత్యసాయి జిల్లాలకు భారీ వర్ష సూచన
అల్పపీడన ప్రభావంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు శ్రీ సత్యసాయి జిల్లా, బుధ, గురువారాల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.
News October 14, 2024
ATP: నేడే లాటరీ.. కిక్కు ఎవరికో
మద్యం షాపులను నేడు లాటరీ ద్వారా కేటాయించనున్నారు. అనంతపురం జిల్లాలోని 136 దుకాణాలకు 3,265, శ్రీ సత్యసాయి జిల్లాలోని 87 షాపులకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రతి దుకాణదారుడికి ఒక నంబర్ కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. నంబర్ వచ్చిన దరఖాస్తుదారుకు లైసెన్సు కేటాయిస్తారు. వారు ఈ నెల 16 నుంచి వైన్ షాపులు ప్రారంభించుకోవచ్చు.
News October 14, 2024
ATP: తగ్గిన టమాటా దిగుబడి.. కిలో రూ.55
జిల్లాలో టమాటా దిగుబడి తగ్గింది. అనంతపురం గ్రామీణ పరిధి కక్కలపల్లి మార్కెట్‌లోని అన్ని మండీలకు కలిపి ఆదివారం 225 టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. దసరా పండుగ నేపథ్యంలో రైతులు మార్కెట్‌కు తీసుకురానట్లు తెలుస్తోంది. కాగా మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.55తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. కిలో సరాసరి ధర రూ.44, కనిష్ఠ ధర రూ.36 పలికినట్లు తెలిపారు.