News April 29, 2024
కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ
తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన సతీమణి సునీత చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేత ఆతిశీ ఈరోజు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు కేజ్రీని కలవనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సునీతకు అనుమతి రాలేదని సమాచారం. వారానికి 2సార్లు మాత్రమే ములాఖత్ ఉండటంతో సునీతకు అనుమతి దక్కేది ఇక వచ్చేవారమేనని అధికారులు అంటున్నారు.
Similar News
News December 27, 2024
రేపు ఈ పనులు చేయకండి
శని త్రయోదశి(రేపు) రోజున శనీశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. రేపు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను అవమానించడం, ఇనుముతో కూడిన వస్తువులు దానం చేయడం, పాదాలతో ఎవరినైనా తాకడం, మాంసం తినడం, మద్యం సేవించడం వంటివి చేయొద్దని అంటున్నారు. నలుపు దుస్తులు ధరించడం, పేదలకు ఆహారం, నల్ల నువ్వులు దానం చేయడం, శని చాలీసా పఠనం వంటివి చేయమని సూచిస్తున్నారు.
News December 27, 2024
26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ మృతి
ముంబై ఉగ్రదాడి(26/11) వెనుక మాస్టర్ మైండ్, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హార్ట్ఎటాక్తో చనిపోయాడు. 2023లో UNO అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌పై విషం చిమ్మే హఫీజ్ రామ్‌పుర, ఎర్రకోట, ముంబై దాడుల్లో కీలకపాత్ర పోషించారు.
News December 27, 2024
రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆయన భౌతికదేహాన్ని నివాసంలోనే సందర్శనార్థం ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.