News April 29, 2024

కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ

image

తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన సతీమణి సునీత చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేత ఆతిశీ ఈరోజు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు కేజ్రీని కలవనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సునీతకు అనుమతి రాలేదని సమాచారం. వారానికి 2సార్లు మాత్రమే ములాఖత్‌ ఉండటంతో సునీతకు అనుమతి దక్కేది ఇక వచ్చేవారమేనని అధికారులు అంటున్నారు.

Similar News

News November 11, 2024

విమాన వేంకటేశ్వరుడి గురించి తెలుసా?

image

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆనంద నిలయం విమాన గోపురంపై వాయవ్య మూలన గూడు లాంటి చిన్న మందిరం ఉంటుంది. వెండి మకరతోరణంతో ఉన్న ఆ మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానమని ప్రతీతి. క్యూలో, రద్దీ కారణంగా ఆనంద నిలయంలోని స్వామి వారి దర్శనం కాకపోతే ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా యాత్రా ఫలం దక్కుతుందని నమ్మకం.

News November 11, 2024

కాలుష్యాన్ని ఏ మతమూ పోత్సహించదు: SC

image

కాలుష్యానికి కారణమయ్యే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టపాసులు కాల్చడంపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు లేదని ప్రశ్నించింది. కాలుష్యం అనేది ఏడాదంతా సమస్యగా మారినప్పుడు కేవలం పండుగ సమయాల్లో నిషేధం విధిస్తున్నారని ఢిల్లీలో కాలుష్యంపై కేసు విచారణ సందర్భంగా కోర్టు తప్పుబట్టింది. ఫ్యాషన్‌గా టపాసులు కాలిస్తే అది ప్రాథమిక ఆరోగ్య హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

News November 11, 2024

మ్యాన్‌హోల్స్ మూతలు రౌండ్‌గానే ఎందుకు?

image

దీనికి పలు కారణాలున్నాయి. వేరే ఆకారంలో ఉంటే మూత తీసేటప్పుడు పొరపాటున లోపలికి పడవచ్చు. రౌండ్‌గా ఉంటేనే ఎటువైపు నుంచీ లోపల పడిపోదు, పైకి సైతం సులువుగా ఎత్తవచ్చు. వృత్తాకారంలో ఉంటేనే ఈజీగా పక్కకు తరలించవచ్చు. అంతే సులువుగా మూత బిగించవచ్చు. ఒక సైజులోని చతురస్రం సహా ఏ ఇతర ఆకారాల్లోని మూత ఎంత స్థలాన్ని మూయగలదో అదే స్పేస్‌ను రౌండ్ షేప్ తక్కువ సైజులో మూస్తుంది. దీంతో నిర్మాణ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.