News March 6, 2025

రంగన్న మృతిపై భార్య అనుమానం.. పోలీసుల దర్యాప్తు

image

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Similar News

News April 19, 2026

గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్‌ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

News April 19, 2026

SRH బ్యాక్ బోన్.. కన్సిస్టెంట్ క్లాసెన్

image

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.

News April 19, 2026

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

image

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టిన‌రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.