News September 15, 2024
వెహికల్కు నంబర్ ప్లేట్ లేదని చీటింగ్ కేసు పెడతారా?: హైకోర్టు

TG: నంబర్ ప్లేట్ లేని బైక్ నడిపాడని ఓ వ్యక్తిపై ఐపీసీలోని 420 సెక్షన్ కింద చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిని హైకోర్టు తప్పుపట్టింది. నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపితే జరిమానా విధించాలని లేదా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ విషయంలో 420 సెక్షన్ కింద కేసు పెట్టడం చట్ట వ్యతిరేకమని, దీనికి సెక్షన్ 80(A) కూడా వర్తించదని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది.
Similar News
News December 21, 2025
ఇంట్లో ధనం నిలవడం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలు

సంపద నిలవాలంటే ఇంట్లో శక్తి ప్రవాహం సరిగ్గా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ‘ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండొద్దు. శుభ్రంగా ఉంటేనే సానుకూలత పెరుగుతుంది. నీటి వృథా ధన నష్టానికి సంకేతం. లీకేజీలను అరికట్టాలి. పని ప్రదేశం అస్తవ్యస్తంగా ఉండొద్దు. వాయువ్యంలో శుభ్రం ముఖ్యం. ఇంట్లో అనవసరమైనవి ఉంచకూడదు. ఇల్లు పద్ధతిగా ఉంటేనే ఆర్థిక స్థితి బాగుంటుంది’అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 21, 2025
ఈ ఏడాదిలో నేడు అతిపెద్ద రాత్రి.. కారణమిదే!

ఈ ఏడాదిలో DEC 21న అతిపెద్ద రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు రాత్రి సమయం 13.30 నుంచి 14 గంటలు ఉంటుంది. సూర్యుడి సదరన్ హెమీస్ఫియర్ (దక్షిణార్ధగోళం) జర్నీ నేటితో ముగిసి నార్తర్న్ హెమీస్ఫియర్(ఉత్తరార్ధగోళం)లో ప్రయాణం టెక్నికల్గా మొదలవుతుంది. ఈ సమయంలో సూర్యుడి నుంచి భూమి అత్యంత దూరంగా వెళుతుంది. భూమి ధ్రువం నుంచి 23.4 డిగ్రీల వంపులో ఉండటం వల్ల శీతాకాలపు అయనాంతం ఏర్పడుతుంది.
News December 21, 2025
త్వరలో తెలంగాణలో SIR: CEC

TG: రాష్ట్రంలో SIR పూర్తయితే ఎన్నికల పరిపాలన కొత్త యుగంలోకి అడుగుపెడుతుందని CEC జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని ఇవాళ HYD రవీంద్ర భారతిలో BLOలతో భేటీలో వెల్లడించారు. ఇక్కడ ఓ BLOకు సగటున 940 మంది ఓటర్లు ఉంటారన్నారు. ఓటర్ జాబితా శుద్ధీకరణను విజయవంతం చేసి దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలపాలని కోరారు. కాగా ఈ నెలాఖరులో తెలంగాణ SIR షెడ్యూల్ వచ్చే అవకాశముంది.


