News September 15, 2024

వెహికల్‌కు నంబర్ ప్లేట్ లేదని చీటింగ్ కేసు పెడతారా?: హైకోర్టు

image

TG: నంబర్ ప్లేట్ లేని బైక్ నడిపాడని ఓ వ్యక్తిపై ఐపీసీలోని 420 సెక్షన్ కింద చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిని హైకోర్టు తప్పుపట్టింది. నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపితే జరిమానా విధించాలని లేదా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ విషయంలో 420 సెక్షన్ కింద కేసు పెట్టడం చట్ట వ్యతిరేకమని, దీనికి సెక్షన్ 80(A) కూడా వర్తించదని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది.

Similar News

News October 12, 2024

ఢిల్లీకి పంత్ గుడ్ బై? ట్వీట్ వైరల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్‌ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.

News October 12, 2024

వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతాం: భట్టి

image

TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

News October 12, 2024

BIG ALERT: అతి భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.