News October 2, 2024
అణు యుద్ధం మొదలు కానుందా?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో అటు ఇరాన్, ఇటు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఒక వేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే న్యూక్లియర్ వార్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా, హౌతీలతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ కూడా యుద్ధంలోకి ఎంటరైంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ రగిలిపోయే ఛాన్స్ ఉంది.
Similar News
News January 14, 2026
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

AP: రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’ సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్‌కు అదనంగా సెస్ చెల్లించాలి. ఈ నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపునకు వినియోగించనున్నారు.
News January 14, 2026
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <
News January 14, 2026
వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.


