News October 2, 2024

అణు యుద్ధం మొదలు కానుందా?

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో అటు ఇరాన్, ఇటు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఒక వేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే న్యూక్లియర్ వార్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా, హౌతీలతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ కూడా యుద్ధంలోకి ఎంటరైంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ రగిలిపోయే ఛాన్స్ ఉంది.

Similar News

News October 4, 2024

చిన్న ఆలయాలకు సాయం రూ.10వేలకు పెంపు

image

AP: ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతిగా, రూ.3వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్చకుడి ఖాతాలోనే జమ చేస్తామంది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది.

News October 4, 2024

ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్

image

చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా, రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రజినీ నటించిన ‘వేట్టయాన్’ ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News October 4, 2024

డీఎస్పీగా నిఖత్ జరీన్

image

TG: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ యూనిఫామ్‌లో కనిపించారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్-2024 ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆమెను సత్కరించి లాఠీని అందజేశారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం అని CM అన్నారు. బాక్సింగ్‌లో రాణించి మెడల్స్ సాధించినందుకు గాను ఆమెకు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.