News February 10, 2025
ఢిల్లీ సీఎంగా మళ్లీ మహిళే?

ఢిల్లీ CMగా మహిళా MLA ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది. BJP అధిష్ఠానం కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నేత, నేషనల్ ఎగ్జిక్యూటివ్, ABVP నుంచి ఎదిగిన రేఖాగుప్త రేసులో ముందున్నారని వార్తలొస్తున్నాయి. శిఖారాయ్ పేరూ వినిపిస్తోంది. DyCM సహా క్యాబినెట్లో మహిళలు, దళితులకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. గతంలో ఢిల్లీకి సుష్మ, షీలా, ఆతిశీ CMలుగా పనిచేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 15, 2025
BRS హయాంలో కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి

TG: KCR, హరీశ్ రావు, KTR సొంత నియోజకవర్గాల్లో BRS హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్‌లో అప్పట్లో రూ.104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు రూ.237 కోట్లు, సిద్దిపేటలో గతంలో రూ.96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో రూ.177 కోట్లు, సిరిసిల్లలో అప్పుడు రూ.101 కోట్లు మాఫీ చేస్తే తాము రూ.175 కోట్ల మాఫీ చేసినట్లు వెల్లడించారు.
News March 15, 2025
ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్?

AP: సినీ నిర్మాత బండ్ల గణేశ్ Xలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి’ అని రాసుకొచ్చారు. కాగా నిన్న డిప్యూటీ సీఎం <<15764256>>పవన్ కళ్యాణ్<<>>పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.