News January 7, 2025
మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: KTR
TG: లాయర్ల సమక్షంలోనే తన విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్లు KTR వెల్లడించారు. తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతానన్నారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారని, ఇలానే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు బుకాయించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని, సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2025
ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
AP: దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే సర్కారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నా. పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. ఇక నుంచి అన్నీ జయాలే. అపజయాలుండవు’ అని ధీమా వ్యక్తం చేశారు.
News January 8, 2025
దక్షిణ కోస్తా రైల్వే జోన్: సాకారమైన కల
AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌కు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు అత్యధికంగా ఆదాయం అందించే దక్షిణ కోస్తా ఏర్పాటు లైన్ క్లియర్ అయింది. కొత్త రైళ్లు, మార్గాలు, ప్రాజెక్టులు మరింత సుగమం కానున్నాయి. ఆర్ఆర్‌బీ, రైల్వే ఆస్పత్రి, శిక్షణ, వర్క్‌షాపులు ఏర్పాటుతో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
News January 8, 2025
ప్రధాని శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం(రూ.149 కోట్లు), గంగవరం పోర్టు-విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 3, 4 రైల్వే లైన్లు(154 కోట్లు), దువ్వాడ-సింహాచలం(నార్త్) 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం(302 కోట్లు), విశాఖపట్నం-గోపాలపట్నం 3,4 రైల్వే లైన్ల నిర్మాణం(159 కోట్లు), గుత్తి-పెండేకల్లు డబ్లింగ్(352 కోట్లు), గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్(2853 కోట్లు), మహబూబ్‌నగర్-డోన్ డబ్లింగ్, విద్యుదీకరణ(రూ.2208 కోట్లు)