News April 4, 2025

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్

image

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ‘త్వరలో బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మోదీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం. CAAతో పాటు పలు చట్ట విరుద్ధ చర్యలపై వేసిన కేసులు కోర్టులో కొనసాగుతున్నాయి. వక్ఫ్ బిల్లుపైనా పోరాడతాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

అపార్ట్‌మెంట్ల సముదాయాలకు వీధిపోటు, వీధి శూల ప్రభావం ఉంటుందా?

image

గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్‌మెంట్లలో వీధిపోటు, వీధి శూల ప్రభావం తక్కువగా ఉంటుందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండి, కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇతరుల దృష్టి తక్కువగా పడుతుంది. భవన నిర్మాణం, భద్రతా ప్రణాళికలు వీటికి రక్షణగా నిలుస్తాయి. ప్లాట్‌లను సమూహంగా నిర్మించడం వలన వచ్చే భద్రత వాటి ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది’ అని వివరించారు. <<-se>>#Vasthu<<>>

News November 21, 2025

వివేకా హత్య కేసు.. సీఐ తొలగింపు

image

AP: YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన <<17811370>>శంకరయ్యను<<>> ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. కేసుకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని అందులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను డిస్మిస్ చేసింది.

News November 21, 2025

ముంబై డ్రగ్స్ పార్టీ.. హీరోయిన్ సోదరుడికి సమన్లు

image

ముంబై డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌కు యాంటీ నార్కోటిక్స్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. 20న విచారణకు గైర్హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒర్రీ 26న రావాలని సూచించింది. సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించినట్టు డ్రగ్స్ వ్యాపారి మొహమ్మద్ సలీమ్ మొహమ్మద్ సుహైల్ షేక్ అంగీకరించినట్టు ముంబై కోర్టుకు తెలిపింది.