News April 4, 2025
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ‘త్వరలో బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మోదీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం. CAAతో పాటు పలు చట్ట విరుద్ధ చర్యలపై వేసిన కేసులు కోర్టులో కొనసాగుతున్నాయి. వక్ఫ్ బిల్లుపైనా పోరాడతాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 23, 2025
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్‌లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్‌కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
News April 23, 2025
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.