News January 27, 2025
బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?: ఎంపీ కిరణ్

TG: బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. <<15279303>>బండి వ్యాఖ్యలు<<>> హాస్యాస్పదమన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి పేరును అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News February 19, 2025
మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి హత్య

TG: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై దుండగులు కత్తితో దాడి చేశారు . తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు వేయగా.. KCR, హరీశ్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై రేపు HCలో విచారణ ఉండగా, నేడు ఆయన హత్యకు గురయ్యారు.
News February 19, 2025
రేప్‌లు చేసి.. కుంభమేళాకు వెళ్తుండగా!

రేప్ చేసి జైలుకెళ్లడం, తిరిగొచ్చి మళ్లీ అదే క్రైమ్ చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. MPకి చెందిన రమేశ్ సింగ్ 2003లో 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు. 2014లో 8ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా, FEB 2న 11ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్‌రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.
News February 19, 2025
‘మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.