News November 22, 2024

ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తా: చంద్రబాబు

image

AP: ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం చంద్రబాబు 4.0ను చూస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలిస్తోంది. ఇక్కడ కూడా అదే రకమైన పాలన ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.

Similar News

News December 9, 2024

గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల

image

TG: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉ.9 గంటల వరకు కమిషన్ <>వెబ్‌సైట్‌లో<<>> హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

News December 9, 2024

పీహెచ్‌డీ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్

image

స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ క్రికెట్‌తో పాటు చదువుపైనా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘60 ఏళ్ల వరకు క్రికెటర్ ఆడలేడు. చనిపోయే వరకు విద్య మనతోనే ఉంటుంది. మంచిగా చదువుకుంటే ఫీల్డ్‌లోనూ మంచి నిర్ణయాలు తీసుకునేందుకు నాకు దోహదపడుతుంది. అందుకే పీహెచ్‌డీ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. KKR ఇతడిని రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది.

News December 9, 2024

తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16 వరకు వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.