News March 20, 2024
రాజ్ ఠాక్రే ఎంట్రీతో బీజేపీకి బలం చేకూరేనా?

400 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న BJP మహారాష్ట్రలో ‘ఠాక్రే’ బ్రాండ్‌పై కన్నేసింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)తో ఉన్న కూటమిలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (MNS)ను ఆహ్వానించింది. ఆ పార్టీ కలిస్తే BJPకి మరింత బలం చేకూరుతుందంటున్నారు విశ్లేషకులు. 2006లో విభేదాల వల్ల శివసేన నుంచి వైదొలగిన రాజ్ ఠాక్రే MNS స్థాపించారు.
Similar News
News January 23, 2026
యూనస్ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్‌ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్‌ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.
News January 23, 2026
RS ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ ‘సజ్జనార్‌పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపైనే లోతైన విచారణ జరగాలి. ఆయన్ను సిట్ చీఫ్‌గా ఎలా నియమిస్తారు. ఆయన ఎలా ట్యాపింగ్ కేసును విచారిస్తారు?’ అని ప్రశ్నించారు.
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.


