News June 4, 2024

రాజస్థాన్‌లో బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందా?

image

లోక్‌సభ ఎన్నికల్లో 2014 నుంచి రాజస్థాన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న BJP మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో 25 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. మోదీ ఇమేజ్, అయోధ్య రామమందిరం మొదలైన అంశాలు పార్టీకి కలిసొచ్చాయి. కాగా ఈసారి విజయాన్ని కూడా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Similar News

News November 3, 2025

శుభ సమయం (03-11-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి రా.11.39 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.12.58 వరకు
✒ శుభ సమయాలు: ఉ.6.30-7.00, సా.7.00-8.00
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.12.24-రా.1.50
✒ అమృత ఘడియలు: ఉ.8.25-ఉ.9.55

News November 3, 2025

రాష్ట్రంలో 225 ఉద్యోగాలు.. APPLY చేశారా?

image

TG: జిల్లా కోఆపరేటివ్​ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగుస్తుంది. HYD​, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్​ జిల్లాల్లో ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgcab.bank.in/

News November 3, 2025

నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తా: KTR

image

TG: కంటోన్మెంట్ నియోజకవర్గానికి CM రేవంత్ రూ.4 వేలకోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని KTR ఓ ఇంటర్వ్యూలో సవాలు చేశారు. నిరూపించలేకపోతే CM రేవంత్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.