News June 4, 2024

రాజస్థాన్‌లో బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందా?

image

లోక్‌సభ ఎన్నికల్లో 2014 నుంచి రాజస్థాన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న BJP మరోసారి క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో 25 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. మోదీ ఇమేజ్, అయోధ్య రామమందిరం మొదలైన అంశాలు పార్టీకి కలిసొచ్చాయి. కాగా ఈసారి విజయాన్ని కూడా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Similar News

News September 11, 2024

ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం!

image

క్రికెట్ ప్రేమికులకో పజిల్. పై ఫొటోలో ఓ లెజెండరీ బౌలర్ ఉన్నారు. వన్డేల్లో 300కి పైగా మెయిడిన్ ఓవర్లు వేసిన ఒకే ఒక క్రికెటర్ అతడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు, 13 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. IPLలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి.
**సరైన సమాధానం మ.ఒంటి గంటకు ఇదే ఆర్టికల్‌లో చూడండి.

News September 11, 2024

నాపై అత్యాచారం చేశాడు: IAF ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు

image

వింగ్ కమాండర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారిణి జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది బర్త్ డే పార్టీ పేరుతో తనను ఇంటికి పిలిచి లైంగిక దాడి చేశాడని తెలిపారు. అతడితో కలిసి విధులు నిర్వర్తించలేనని, తనను వేరే చోటకు బదిలీ చేయాలని కోరారు. కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు.

News September 11, 2024

BAD LUCK: మూడో రోజూ ఆట రద్దు

image

గ్రేటర్ నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు రోజుల ఆట రద్దవగా, వర్షం కారణంగా నేడు జరగాల్సిన ఆటను కూడా అంపైర్లు రద్దు చేశారు. ఈ విషయం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్లనూ నిరాశలోకి నెట్టింది. రేపైనా పరిస్థితులు అనుకూలించి మ్యాచ్ జరగాలని క్రీడా వర్గాలు కోరుకుంటున్నాయి.