News November 30, 2024

ఆ రికార్డును బుమ్రా నెలకొల్పుతారా?

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా చెలరేగుతోంది. ఈక్రమంలో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ముంగిట ఉన్న ఓ రికార్డు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా బుమ్రా (40) ఉన్నారు. అగ్రస్థానంలో కపిల్ దేవ్ (51), రెండో స్థానంలో అనిల్ కుంబ్లే (49) ఉన్నారు. BGT పూర్తయ్యేలోపు బుమ్రా తొలి స్థానానికి వెళ్తారా? కామెంట్ చేయండి.

Similar News

News April 17, 2026

మహిళా బిల్లుకు గతంలోనే మద్దతిచ్చాం: CBN

image

AP: ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు పలుకుతున్నామని CM చంద్రబాబు TDP ఆఫీసులో మీడియాతో పేర్కొన్నారు. ‘గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాం. కొన్ని కారణాలతో అప్పుడది కార్యరూపం దాల్చలేదు’ అని వివరించారు. ఈసారైనా బిల్లు నెగ్గి అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించగా ‘మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు వంటింట్లో పని చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా’ అని CBN వ్యాఖ్యానించారు.

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.

News April 17, 2026

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.