News February 11, 2025
2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.
Similar News
News December 3, 2025
తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈనెల 17న తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి.పద్మావతి తెలిపారు. ఈ బస్సు శ్రీశైలం, మహానంది, అహోబిలం, పళని, గురువాయూర్, అయ్యప్ప సన్నిధానం, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుందని బుధవారం ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.
News December 3, 2025
రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్లో జరగనుంది.
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా


