News February 11, 2025

2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్‌కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.

Similar News

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

image

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.