News October 28, 2024

కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.

Similar News

News February 7, 2026

వెండితెరపై తండ్రీకూతుళ్ల జోరు!

image

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తండ్రీకొడుకుల కాంబోలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 2026లో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా సత్తా చాటగా గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించారు. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు.

News February 7, 2026

TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

News February 7, 2026

ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

image

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.