News October 28, 2024
కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?
TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.
Similar News
News November 8, 2024
అందుకే కేటీఆర్‌ను అరెస్ట్ చేయట్లేదు: బండి
TG: కేటీఆర్‌తో కుదిరిన ఒప్పందంతోనే ఆయనను రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. CM పాదయాత్ర చేయాల్సింది మూసీ నది పక్కన కాదని ఇళ్లు కూల్చిన ప్రాంతంలో అని ఎద్దేవా చేశారు. BJPకి స్పేస్ లేకుండా కాంగ్రెస్, BRS డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులపై హంగామా చేశారన్నారు. ఇప్పుడు ఎలాంటి చప్పుడు లేదన్నారు.
News November 8, 2024
సమోసాల మిస్సింగ్‌పై నో ఎంక్వైరీ: CID
హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
News November 8, 2024
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.