News March 12, 2025

DDకి పునర్వైభవం రానుందా?

image

దూరదర్శన్‌ ఛానల్‌ను పునరుద్ధరించడానికి ప్రసారభారతి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ జర్నలిస్టు &న్యూస్ యాంకర్ సుధీర్ చౌదరితో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో సుధీర్ దూర్‌దర్శన్‌లో పనిచేస్తారని, విశ్వసనీయ & ప్రభావవంతమైన వార్తలను అందించేందుకు కృషి చేస్తారని సమాచారం. ఈ ఒప్పందం కోసం దాదాపు రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో DD ఒక పవర్‌హౌస్‌గా మారే అవకాశం ఉంది.

Similar News

News March 12, 2025

వ్యక్తిగత, వృత్తి జీవితం బ్యాలెన్స్ చేయలేక 52శాతం మందిపై ఒత్తిడి

image

వర్క్-లైఫ్-బ్యాలెన్స్‌పై వర్టెక్స్ గ్రూప్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతుల్యం చేయలేక 52 శాతం మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపింది. 23శాతం ఎక్కువ గంటలు, 20 శాతం 2.5-3.5 గంటలే పనిచేస్తున్నారని పేర్కొంది. ఇండియాలో ఐదుగురిలో నలుగురు కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించింది. మరి మీ వర్క్-లైఫ్‌ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

News March 12, 2025

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 26వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుంది. తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చారు.

News March 12, 2025

సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

TG: 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 నుంచి 21 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు, బరువు, ఛాతి, జీతం తదితర వివరాల కోసం పూర్తి <>నోటిఫికేషన్‌ను <<>>చూడండి.

error: Content is protected !!