News March 12, 2025
DDకి పునర్వైభవం రానుందా?

దూరదర్శన్ ఛానల్‌ను పునరుద్ధరించడానికి ప్రసారభారతి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ జర్నలిస్టు &న్యూస్ యాంకర్ సుధీర్ చౌదరితో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో సుధీర్ దూర్‌దర్శన్‌లో పనిచేస్తారని, విశ్వసనీయ & ప్రభావవంతమైన వార్తలను అందించేందుకు కృషి చేస్తారని సమాచారం. ఈ ఒప్పందం కోసం దాదాపు రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో DD ఒక పవర్‌హౌస్‌గా మారే అవకాశం ఉంది.
Similar News
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News April 13, 2026
ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.
News April 13, 2026
కుప్పకూలిన మార్కెట్లు.. నిమిషాల్లో రూ.8లక్షల కోట్లు హాంఫట్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,624 పాయింట్లు, నిఫ్టీ 476 పాయింట్లు కోల్పోయాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. యుద్ధంపై పీస్ టాక్స్, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో గతవారం మార్కెట్లు 6% వృద్ధి సాధించాయి. కానీ చర్చలు విఫలమవడం, క్రూడాయిల్ ధర పెరగడంతో మళ్లీ నష్టాల బాట పట్టాయి.


