News April 14, 2025
కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.
Similar News
News April 16, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.లక్ష జమ
* ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి
* ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో గ్రూప్-1 వాల్యూయేషన్: TGPSC
* AP: మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: CM చంద్రబాబు
* ఈ నెల 26న మత్స్యకారుల అకౌంట్లలోకి రూ.20,000
* AP పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
* KKRపై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ
News April 16, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రీజనల్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చల్లో తమకు నెల గడువు కావాలని యాజమాన్యం కోరింది. అలాగే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను అంగీకరించిన కమిషనర్ యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనే తదితర డిమాండ్లతో కార్మికులు సమ్మె చేయాలని భావించిన విషయం తెలిసిందే.
News April 16, 2025
ఏపీకి చేరుకున్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు

AP: 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు సచివాలయంలో అమరావతి ఫొటో గ్యాలరీని వీరు తిలకించనున్నారు. అనంతరం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంపై వీరితో సీఎం, మంత్రులు రేపు చర్చిస్తారు. రాత్రి తిరుపతికి వెళ్తారు. ఎల్లుండి స్థానిక ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపారులతో భేటీ అవుతారు.