News April 28, 2024

వరల్డ్‌కప్‌నకు ఎంపికవ్వకపోతే బాధపడతా: గిల్

image

టీ20 వరల్డ్ కప్‌నకు భారత జట్టును ఈ నెలాఖరులోపుగానే ప్రకటించనున్నారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్‌‌నే ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ స్పందించారు. ‘గత ఏడాది ఐపీఎల్‌లో 900 పరుగులు చేశాను. వన్డే ప్రపంచ కప్ ఆడాను. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఆడితే మరో కల తీరినట్లే. జట్టులో ఉంటానన్న నమ్మకం ఉంది. ఎంపికవ్వకపోతే బాధపడతా. కానీ ఏదేమైనా భారత జట్టుకు అండగా ఉంటా’ అని తెలిపారు.

Similar News

News December 9, 2025

మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

image

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News December 9, 2025

ORR-RRR మధ్య KPHB తరహా కాలనీలు: పొంగులేటి

image

TG: HYD, చుట్టుపక్కల ఇళ్లు, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్’ విధానాన్ని ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి పి.శ్రీనివాసరెడ్డి దీన్ని వెల్లడించారు. తెలంగాణ-2047 విజన్లో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్‌లకు అనుగుణంగా సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదాయం పరిమితులతో సంబంధం లేకుండా ORR-RRR మధ్య KPHB తరహా కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు.

News December 9, 2025

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ వీడియో వైరల్.. తప్పెవరిది?

image

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహికాశర్మ వీడియో ఒకటి SMలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించే ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ <<18512560>>మండిపడ్డారు<<>>. హద్దుమీరి ఫొటోలు తీసే ముంబై కెమెరామెన్ల(పపరాజీ)పై గతంలో కొందరు సెలబ్రిటీలు ఆగ్రహించారు. వారి గురించి తెలిసి కూడా లోదుస్తులు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం ఎందుకని కొందరు నెటిజన్లు మహికాను ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం తప్పా అని మరికొందరు ఆమెకు మద్దతిస్తున్నారు.