News April 28, 2024
వరల్డ్‌కప్‌నకు ఎంపికవ్వకపోతే బాధపడతా: గిల్

టీ20 వరల్డ్ కప్‌నకు భారత జట్టును ఈ నెలాఖరులోపుగానే ప్రకటించనున్నారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్‌నే ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ స్పందించారు. ‘గత ఏడాది ఐపీఎల్‌లో 900 పరుగులు చేశాను. వన్డే ప్రపంచ కప్ ఆడాను. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఆడితే మరో కల తీరినట్లే. జట్టులో ఉంటానన్న నమ్మకం ఉంది. ఎంపికవ్వకపోతే బాధపడతా. కానీ ఏదేమైనా భారత జట్టుకు అండగా ఉంటా’ అని తెలిపారు.
Similar News
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 18, 2026
అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేస్తుంది: ట్రంప్

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టంచేశారు. ‘యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి’ అని ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.
News April 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


