News May 11, 2024

దేశం కోసం 100 CM పదవులు వదులుకుంటా: కేజ్రీవాల్

image

తనకు CM పదవి ముఖ్యం కాదని, దేశం కోసం వంద సీఎం సీట్లు వదులుకుంటానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అత్యధిక ఓట్లతో గెలిచిందని, ఆ మెజారిటీ చూశాక తాము ఇక్కడ గెలవలేమని BJPకి అర్థమైందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆప్ ప్రభుత్వం పడిపోయేలా తనను జైలులో పెట్టాలని నిర్ణయించుకుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు నిన్న సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2025

కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి

image

TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

News February 12, 2025

‘స్పిరిట్’: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కథను డైరెక్టర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈక్రమంలో కొత్త/ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులను తీసుకునేందుకు మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. దీంతో చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈలెక్కన అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

News February 12, 2025

ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్‌లో నిధులు: సీఎం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.

error: Content is protected !!