News August 9, 2024
హసీనా బంగ్లాకు తిరిగి వెళ్తారా? ఆమె కొడుకు ఏమన్నారంటే..

బంగ్లా అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఆమెకు స్వదేశానికి తిరిగి వెళ్లే ఆలోచన ఉందా? ఈ ప్రశ్నకు ఆమె తనయుడు సజీబ్ వాజెద్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘మా అమ్మకు బంగ్లాదేశ్ అంటే ప్రాణం. అది తన దేశం. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కచ్చితంగా అక్కడికి వెళ్తారు. భారత్ సహకారంతో అక్కడ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని మేం ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News March 4, 2026
దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

దేశంలో వైట్ కాలర్ జాబ్స్ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.
News March 4, 2026
ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.
News March 4, 2026
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది లిస్ట్‌ను టీపీసీసీ హైకమాండ్‌కు పంపింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


