News August 9, 2024
హసీనా బంగ్లాకు తిరిగి వెళ్తారా? ఆమె కొడుకు ఏమన్నారంటే..
బంగ్లా అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఆమెకు స్వదేశానికి తిరిగి వెళ్లే ఆలోచన ఉందా? ఈ ప్రశ్నకు ఆమె తనయుడు సజీబ్ వాజెద్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘మా అమ్మకు బంగ్లాదేశ్ అంటే ప్రాణం. అది తన దేశం. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కచ్చితంగా అక్కడికి వెళ్తారు. భారత్ సహకారంతో అక్కడ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని మేం ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News September 21, 2024
చరిత్ర సృష్టించిన అఫ్గాన్
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.
News September 21, 2024
రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు
ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
News September 21, 2024
భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే
ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.