News February 20, 2025

భారత్ గెలుస్తుందా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 10వ ఓవర్లో రోహిత్ ఔటయ్యాక స్కోరులో వేగం తగ్గింది. కోహ్లీ (22), అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) నిరాశపరిచారు. ప్రస్తుతం గిల్ (63*), కేఎల్ రాహుల్ (3*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 17 ఓవర్లలో 75 రన్స్ కావాలి.

Similar News

News March 26, 2025

Stock Markets: మీడియా, హెల్త్‌కేర్ షేర్లు కుదేలు

image

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, రెసిస్టెన్సీ స్థాయి వద్ద అమ్మకాల సెగతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్లో నిఫ్టీ 23,604 (-65), సెన్సెక్స్ 77,696 (-320) వద్ద చలిస్తున్నాయి. మీడియా, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు, ఫైనాన్స్, చమురు, ఐటీ, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, BEL, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. TECH M, NTPC, యాక్సిస్, సిప్లా టాప్ లూజర్స్.

News March 26, 2025

ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్‌గా ఉండగలరా?: CM యోగి

image

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.

News March 26, 2025

అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

image

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.

error: Content is protected !!