News August 12, 2024
కవితకు బెయిల్ వస్తుందా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకూ బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
Similar News
News September 13, 2024
నేనొక సీరియల్ డేటర్: రెజీనా
ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.
News September 13, 2024
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
News September 13, 2024
ALERT.. మళ్లీ వర్షాలు
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.