News December 9, 2024
అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారా?

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కాగా, BRS అధినేత KCR సభకు వస్తారా? రారా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని CM పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. KCR సభకు వస్తారా? రారా? Comment చేయండి.
Similar News
News December 4, 2025
జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.
News December 4, 2025
ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.
News December 4, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.


