News December 9, 2024

అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారా?

image

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కాగా, BRS అధినేత KCR సభకు వస్తారా? రారా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని CM పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. KCR సభకు వస్తారా? రారా? Comment చేయండి.

Similar News

News January 22, 2025

ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం కోసం ఎదురుచూపు

image

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డుంకీ’లో నటించిన వరుణ్ కులకర్ణి తీవ్ర కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తోటి నటుడు రోషన్ శెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వరుణ్ వైద్య ఖర్చులను సైతం భరించలేని స్థితిలో ఉన్నాడని తెలుపుతూ ఇండస్ట్రీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుణ్ ‘స్కామ్ 1992’ & ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (ప్రైమ్ వీడియో) వంటి సిరీస్‌లలో కనిపించారు.

News January 22, 2025

BRSకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

image

TG: బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ నల్లగొండ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ఈ నెల 21న నల్లగొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ స్థానిక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

News January 22, 2025

ఎలా ఆడాలో రోహిత్‌కు చెప్పక్కర్లేదు: రహానే

image

రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.