News March 21, 2024
కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.
News November 21, 2025
ఆక్వా రంగాన్ని APకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం: CBN

AP: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం మనల్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయన్నారు. ‘వేట నిషేధ సమయంలో 1.29L మందికి ₹20వేల చొప్పున ₹259 కోట్లు ఇచ్చాం. ఆక్వారంగం బలోపేతానికి ₹1.50కే యూనిట్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్వా రంగాన్ని ఏపీకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
PGIMERలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER) 5 పోస్టులను భర్తీ చేస్తోంది. డిగ్రీ, పీజీ(సోషియాలజీ) ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు ఈనెల 22న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుకు గరిష్ఠ వయసు 35, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 30ఏళ్లు. వెబ్సైట్: https://pgimer.edu.in/


