News July 12, 2024
కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ED అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం మే17న దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ స్కామ్‌లో <<13608833>>కేజ్రీవాల్<<>> కీలక పాత్ర పోషించారని ED ఛార్జిషీట్ దాఖలు చేయగా, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు అని ఆయన పేర్కొన్నారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 7, 2025
TODAY HEADLINES

☞ TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేయాలి.. ఎమ్మెల్యేలతో CM
☞ TG పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
☞ తీన్మార్ మల్లన్నకు TPCC షోకాజ్ నోటీసులు
☞ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34%: AP క్యాబినెట్
☞ కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: CM చంద్రబాబు
☞ అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం రికార్డ్: జగన్
☞ సమాజంలో కాంగ్రెస్ కుల విషం చిమ్ముతోంది: PM
☞ ENGతో తొలి వన్డేలో IND విజయం
News February 7, 2025
కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రి

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News February 7, 2025
ఈ ఊళ్లో అసలు చెప్పులు వేసుకోరు..!

AP: తిరుపతికి 50 కి.మీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వేంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు.