News August 3, 2024

మీ అందరినీ గర్వపడేలా చేస్తా: నిఖత్

image

ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత బాక్సర్ నిఖత్ జరీన్ ’X‘లో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నా ఒలింపిక్ కల ఆశించినట్లుగా ముగియలేదు. ఎన్నో రోజుల శిక్షణ ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఓటమిని భరించలేకపోతున్నా. కానీ దీనిని అంగీకరించాల్సిందే. ఒలింపిక్ పతకం కోసం శ్రమించినా విధి మరోలా చేసింది. మరింత కష్టపడి మీ అందరినీ గర్వపడేలా చేస్తా. సపోర్ట్ చేసిన వారికి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 14, 2025

టమాటాలో కాయ పగుళ్లకు కారణం – నివారణ

image

టమాటా కాయ అభివృద్ధి చెందే దశలో కాయ తొడిమ వైపు, పూత చివరి వైపునకు నిలువు పగుళ్లు కనిపిస్తాయి. నీటి లభ్యతలో తేడాలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం తర్వాత వానలు, బోరాన్ లోపం వల్ల ఈ పగుళ్లు కనిపిస్తాయి. దీని నివారణకు నేలలో తేమ సంరక్షణకు మల్చింగ్ చేపట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పూత, పిందె దశల్లో లీటరు నీటికి డైసోడియం ఆక్టాబోరెట్ 1.25-1.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News December 14, 2025

పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

image

మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయిలో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. కాసేపట్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆరంభించనుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్

News December 14, 2025

హిందూ ధర్మంలో ‘108’ విశిష్టత

image

మనం 108ని పవిత్రమైన సంఖ్యగా భావించడానికి అనేక కారణాలున్నాయి. మన హిందూ ధర్మంలో ఈ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతలకు నామాలు, శివుడికి అనుచరులు, కృష్ణుడి బృందావనంలో పూల సంఖ్య నూట ఎనిమిదే. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యచంద్రుల వ్యాసానికి 108 రెట్లు వాటికి భూమికి మధ్య దూరం ఉంటుంది. మనవ శరీరంలో కూడా మనం దృష్టి సారించాల్సిన చక్రాలు 108 ఉంటాయి. జపమాలలోనూ ఇన్నే పూసలుంటాయి.