News January 21, 2025
సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వం: తెలంగాణ

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వమని తెలంగాణ నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా KRMB సమావేశంలో స్పష్టం చేశారు. సాగర్ పర్యవేక్షణ నుంచి CRPF బలగాలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా పెంచాలని కోరారు. 79-21 వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు 50-50 పద్ధతిలో నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. నదీ జలాల మళ్లింపు విషయంలో కలగజేసుకోవాలని బోర్డును కోరారు.
Similar News
News November 28, 2025
HYD: సంక్షేమాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి: చనగాని

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలనకే ప్రజలు పట్టం కడతారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని, సుప్రీంకోర్టు విధించిన నిబంధన మేరకు జరుగుతున్న ఎన్నికలు అనేది KTRకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.
News November 28, 2025
‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.
News November 28, 2025
తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్షిప్

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ని కోరారు. ఈ టౌన్షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.


