News September 28, 2024

ఎన్టీఆర్ ‘దేవర’ వచ్చేది ఈ ఓటీటీలోకే?

image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌(OTT)లో రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

Similar News

News October 5, 2024

వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్

image

TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.

News October 5, 2024

పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM

image

TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.

News October 5, 2024

రేవంత్ CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: KTR

image

TG: రేవంత్‌రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.