News January 21, 2025

ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?

image

ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.

Similar News

News January 21, 2025

రంజీ ఆడనున్న రోహిత్.. MCA కీలక నిర్ణయం

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడుతున్నారు. దీంతో MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై-జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరిగే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని, ఇందుకు తగినట్లుగా సీట్లు ఏర్పాటు చేయాలని భావించింది.

News January 21, 2025

ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO

image

WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.

News January 21, 2025

IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.