News December 14, 2024
పార్లమెంటు నాదవుతుందా?: ఒవైసీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734179898776_1045-normal-WIFI.webp)
దేశవ్యాప్తంగా పలు మసీదుల కూల్చివేతకు కుట్ర జరుగుతోందని MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘500 ఏళ్ల క్రితం మసీదు ఉందా అని అడుగుతున్నారు. మరి పార్లమెంటు కింద నాకు సంబంధించిన వస్తువు దొరికితే పార్లమెంటు నాదవుతుందా?’ అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని భారత ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News January 13, 2025
కౌశిక్ రెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గం: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732015641405_1045-normal-WIFI.webp)
TG: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్‌ను బేషరతుగా విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News January 13, 2025
కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736781672845_695-normal-WIFI.webp)
TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్‌కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు.
News January 13, 2025
సంక్రాంతి వేడుకల ఫొటోలను పంచుకున్న మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736779833759_653-normal-WIFI.webp)
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి, పొంగల్‌ను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ పండగ భారతీయ వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.