News June 12, 2024
ఇప్పటికైనా విభజన హామీలు నెరవేరుస్తారా?: జైరాం రమేశ్

ఏపీ విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘APకి ప్రత్యేక హోదాను అందిస్తారా? పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తారా? కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు, వ్యవసాయ విద్యాలయం వంటి వాటిని ఇప్పటికైనా మంజూరు చేస్తారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 19, 2025
నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.
News March 19, 2025
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.