News March 23, 2024
మూల్యం చెల్లించుకుంటారు.. పుతిన్ వార్నింగ్
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఘటన వెనుక ఎవరున్నా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా, ఐక్యరాజ్య సమితి, ఈయూ ఖండించాయి. అయితే ఉగ్రదాడి జరగొచ్చని వారం క్రితమే రష్యాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించడం గమనార్హం.
Similar News
News September 17, 2024
వైసీపీ వల్లే ఈ పరిస్థితి: చంద్రబాబు
AP: భవానీపురం రోడ్డు, బుడమేరులో ఊహించని వరద వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా పనులు వదిలేయడమే ఈ పరిస్థితికి కారణమని మీడియాతో చెప్పారు. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో 40 మెట్రిక్ టన్నుల బరువున్న 3 బోట్లు బ్యారేజీ గేట్ కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టాయని చెప్పారు. ఇప్పటికీ వాటిని తీసేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆ ప్రభుత్వమే ఉంటే ఇంకా కోలుకునే వాళ్లం కాదన్నారు.
News September 17, 2024
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ ప్రోగ్రామ్ ఉండే ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఈవెంట్ కోసం ప్రయత్నించినా ఆ వారంలో వర్షసూచన ఉండటంతో వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా అతిథులపై క్లారిటీ రాలేదు.
News September 17, 2024
చంద్రబాబు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి: VSR
AP: సీఎం చంద్రబాబు నివసించే అక్రమ కట్టడాన్ని మొదట కూలగొట్టడం సముచితం అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది? పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే’ అని ట్వీట్ చేశారు.