News November 18, 2024

‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ ఇలానే ఉంటుందా?

image

మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ అలవాటు ఉందని సినీవర్గాలు చెబుతుంటాయి. ఆయన తీసే సినిమాల్లో షూటింగ్ పూర్తయ్యేవరకూ ఆయన హీరోల లుక్‌‌లోనే కనిపిస్తారని పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తీసినప్పుడు విజయ్ దేవరకొండ లుక్‌లో, ‘యానిమల్’ తీసినప్పుడు రణ్‌బీర్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన గడ్డం తీసి కేవలం మీసంతో కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్ కోసమే ఇలా మారిపోయారని చర్చ జరుగుతోంది.

Similar News

News April 19, 2026

నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

image

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.

News April 19, 2026

‘లెనిన్’లో నాగ్ మార్పులు?

image

మురళీ కిశోర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. దీంతో మూవీని ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన <<19666338>>‘యెట్టా యెట్టా’<<>> పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 19, 2026

మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

image

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.