News December 11, 2024

‘పుష్ప-2’ అత్యధిక కలెక్షన్ల మూవీగా మారనుందా?

image

‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టి ఈ ఘనత సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దంగల్’. IMDb ప్రకారం ఈ చిత్రానికి రూ.2024 కోట్లు వచ్చాయి. దీని తర్వాత బాహుబలి-2(రూ.1742 కోట్లు), RRR(రూ.1250.9 కోట్లు), KGF-2 (రూ.1176 కోట్లు), జవాన్‌ (రూ.1157 కోట్లు), పఠాన్‌(రూ.1042 కోట్లు), కల్కి (రూ.1019 కోట్లు) ఉన్నాయి.

Similar News

News January 20, 2025

పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్

image

నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.

News January 20, 2025

ఇండియా కూటమిలో చేరాలని విజయ్‌కి ఆఫర్

image

విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

News January 20, 2025

ఇలాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు: ఈటల

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.