News November 30, 2024

ఈ విషయంలో ‘బాహుబలి-2’ను ‘పుష్ప-2’ బ్రేక్ చేస్తుందా?

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ DEC 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 12000+ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇండియాలో 8500+ స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్ దృష్ట్యా మరిన్ని స్ర్కీన్లు సిద్ధం చేస్తామన్నాయి. కాగా భారతీయ చరిత్రలో అత్యధికంగా 9000+ స్క్రీన్స్‌లో బాహుబలి-2 రిలీజ్ చేసినట్లు తెలిపాయి.

Similar News

News November 12, 2025

ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్

image

AP: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత 16 నెలల్లో $120B పెట్టుబడులు వచ్చాయి. 5 ఏళ్లలో 20L ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. పెట్టుబడిదారులు APని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని CII సమ్మిట్‌పై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వివరించారు.

News November 12, 2025

జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.

News November 12, 2025

ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

image

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.