News November 30, 2024
ఈ విషయంలో ‘బాహుబలి-2’ను ‘పుష్ప-2’ బ్రేక్ చేస్తుందా?
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ DEC 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 12000+ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇండియాలో 8500+ స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్ దృష్ట్యా మరిన్ని స్ర్కీన్లు సిద్ధం చేస్తామన్నాయి. కాగా భారతీయ చరిత్రలో అత్యధికంగా 9000+ స్క్రీన్స్‌లో బాహుబలి-2 రిలీజ్ చేసినట్లు తెలిపాయి.
Similar News
News December 8, 2024
రాముడే సిగ్గుతో తలదించుకుంటాడు: ఇల్తిజా
రాముడి పేరు నినదించలేదన్న కారణంతో ముస్లిం యువకులను హింసించడం లాంటి ఘటనలతో రాముడే సిగ్గుతో తలదించుకుంటాడని PDP నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ ఇలాంటి సమయాల్లో రాముడు సైతం నిస్సహాయంగా ఉండిపోతారని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడగొడుతూ లక్షలాది మంది భారతీయులను పట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.
News December 8, 2024
భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.
News December 8, 2024
కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే
TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.